శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు..