Yadadri : నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. విష్వక్సేన ఆరాధనతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు.
Read Also: Revanth Reddy : ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉంది
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను 1955లో ఏపీ ఏర్పాటయ్యక 11 రోజులపాటు జరిపించారు. అంతకుమందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. మొదటగా ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాస్తంభోద్భవుడు లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైనది. పునర్నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు 11 రోజులపాటు సాగే వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Also:Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ముగ్గురులో రెన్యువల్ ఎవరికి?
వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నామనని యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ గీత ప్రకటించారు. స్వామివారి దర్శనాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. బ్రేక్ దర్శనంతో పాటు ధర్మ, ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయన్నారు. యాదగిరీశుడి ఉత్సవాలను గతం కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి ప్రధానాలయంతో పాటు ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుద్దీపాలతో దేవాలయం ఉత్సవ శోభను సంతరించుకున్నది. స్వామివారి సేవలను వినియోగించే వాహనాలను సిద్ధం చేశారు. ప్రధానాలయాన్ని శుద్ధి చేసి రంగురంగుల పూలతో అలంకరించారు.