Brahmotsavalu in Tirumala: ఏడాదికి 365 రోజులు మాత్రమే. కానీ.. ఏడుకొండలవాడికి అంతకన్నా ఎక్కువే ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరం పొడవునా సప్తగిరుల పైన నిర్వహించే సంబరాలన్నింటిలోకీ బ్రహ్మోత్సవమే సర్వోన్నతమైంది. సకల సందేశాలతో కూడింది. కలియుగ దైవం కోవెల నుంచి ఉత్సవమూర్తి రూపంలో భక్తకోటిలోకి వచ్చి వాళ్ల హృదయాల ఊయలలో, మారుమోగే గోవింద నామస్మరణాల నడుమ ఊరేగుతాడు. తనను కొలిచే గుండెల్లో, పిలిచే గొంతుల్లో అంతర్లీనంగా గొప్ప ఆధ్యాత్మిక భావనను నింపుతాడు.
తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు…