యూపీలోని కాన్పూర్ లో ఓ ప్రేమికుడు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రేమికుడు.. తన ప్రియురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ కూతురిని తనకిచ్చి పెళ్లి చేయాలని.. లేదంటే రక్తం కళ్ల చూడాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా.. ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే, అక్కడికెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఎవరితోనూ పెళ్లి చేయకని సూచించాడు.
Shocking Incident: ఇటీవల పెళ్లి మండపంలో జరిగిన వింత ఘటనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని కామెడీ, మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. వివాహేతర సంబంధంతో సహజీవనం చేస్తున్న పార్వతి అనే మహిళపై ప్రియుడు మోహన్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది..
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని ఎనిమిది సార్లు కత్తితో పొడిచాడు. రక్తమోడుతూ విలవిలలాడుతుంటే.. మొబైల్‌లో షూట్ చేస్తున్నారే తప్ప.. ఎవరు ముందుకొచ్చి రక్షించిన పాపాన పోలేదు.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రేమ మత్తులో పడి యువతకు కళ్ళు మూసుకుపోయాయి. వయసులో ప్రేమకు ఆకర్షణకు మధ్య తేడా తెలియక చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టే వారు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వారు మరి కొందరు.
జీడిమెట్ల పియస్ పరిధిలోని న్యూ ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. షాపూర్ నగర్, ఎన్ ఎల్బీనగర్ లో నివాసం ఉండే అఖిల (22) అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయిగౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో.. చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్దితిలో అఖిల ప్రేమించింది. ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో చిన్నచిన్న విషయాలపై గొడవపడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు. పెళ్ళి చేసుకోనని తేల్చిచెపడంతో అఖిల…
ప్రేమించే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత.. అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ప్రేమించే ముందే.. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రేమించాలి. అయితే తాజాగా.. ప్రేమించిన ప్రియుడిని కాదనుకునేందుకు హత్య చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది.
జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట పటాస్ షో ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లగా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఎన్నో స్కిట్ లలో కనిపించి తన కామెడితో కడుపుబ్బా నవ్వించేసింది.. ఈ అమ్మడు ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.. జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నటు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదని తేలింది.. ఇప్పుడు…