ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగింది. కామరాజ నగర్లోని ఆశిక్ (19) తన ఊరిలోనే ఓ అమ్మాయిని (17) ప్రేమించాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువతి ఆశిక్తో మాట్లాడటానికి నిరాకరించింది. మనోవేదనకు గురైన ఆశిక్.. ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి సైతం బలవన్మరణానికి పాల్పడింది.
టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా దీపికా, అనన్య పాండే ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే, శకున్ బత్రా సినిమాలో మరో హీరో కూడా అవసరం. ఆయన సినిమా రెండు యువ జంటల మధ్య సంబంధం ఆధారంగా నడవబోతోందట. అందుకే, దీపికాకి జతగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేశారు. అనన్యతో రొమాన్స్ చేయాల్సిన పాత్రకి అవినాశ్ తివారీ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు…
‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. తరువాతి కాలంలో ముందుగా తానే ప్రేమ సంగతి ప్రియుడితో చెప్పిందట కూడా!…