యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ప్రియుడితో కలిసి భర్త తలను ఇటుకతో పగులగొట్టి హత్య చేసింది. అనంతరం.. భర్త మృతదేహంపై ఇటుకలను పడేశారు. ఉదయం తన తల్లి ఇంటికి వెళ్లిన భార్య రాత్రి ఇటుకలు పడిపోవడంతో భర్త మృతి చెందాడని చెప్పింది. మృతదేహంపై తల తప్ప మరెక్కడా గాయాలు లేకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
Crime News: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన లివింగ్ ఇన్ పార్ట్నర్‌ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికిన ఘటన.. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఓ వివాహిత తన ప్రియుడి వల్ల మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయం ఆ మహిళ భర్తకు కూడా తెలియదు. భర్త లేకపోవడంతో ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు పిల్లల తల్లి, ఏడు నెలల గర్భిణి భర్తను వదిలేసి గుడిలో ప్రియుడితో పెళ్లి చేసుకుంది.
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కట్టుకున్నవారినే కాదని అడ్డదారులు తొక్కుతున్నారు. కలకలం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసి మధ్యలోనే పెడదారి పడుతున్నారు. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది..
కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది..
ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తన చేతి మణికట్టు కోసుకుని దాన్ని వీడియో తీసి ప్రేమికుడికి పంపించింది. ఆ యువకుడు ఆస్పత్రికి పరిగెత్తగా.. ప్రియురాలి పరిస్థితి చూసి స్పృహతప్పి పడిపోయాడు.