West Godavari Crime: ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాలపైకి.. ప్రియురాలిని కాపాడి ప్రాణాలు విడిచిన ప్రియుడు
- పాలకొల్లులో విషాద ఘటన..
- ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు..
- ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి ప్రేమ జంట..
- రైలు వచ్చే సమయంలో ప్రియురాలిని పక్కను నెట్టిన ప్రియుడు..
- తాను మాత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Godavari Crime: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.. కానీ, పెద్దలు అంగీకరించకపోవడంతో.. కలిసి ఎలాగూ బతకలేం.. కనీసం కలిసి చనిపోదాం అనుకున్నారు.. అందులో భాగంగా.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.. పట్టాలపైకి ఎక్కారు.. తీరా రైలు వచ్చే సమయానికి ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలు బతకాలని అనుకున్నాడు.. దీంతో.. ప్రియురాలిని రైలు పట్టాల పై నుంచి కిందకి తోసేసి.. తాను మాత్రం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
Read Also: Anand Bose: హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ.. రాష్ట్రపతి పాలనపై ఊహాగానాలు!
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద యువకుడు మృతి చెంది పడి ఉన్నాడని, పక్కనే మరోయువతి రక్త మడుగులో కూర్చుని విలపిస్తూ ఉండడం గమనించిన స్థానికులు.. 108కి సమాచారం అధించారు. యువతి తీవ్రమైన గాయాలు అవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరం రైల్వే ఎస్సై టీవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరంకు చెందిన రాజేష్, ఏస్. కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోవడంతో నిన్న రాత్రి భీమవరం నుండి బండిపై పాలకొల్లు చేరుకున్నారు.. ఆత్మహత్య చేసుకుందామని పట్టాలపైకి వెళ్లారు.. ఇంతలో ట్రైన్ దగ్గరకు రాగానే ప్రియురాలిని పక్కకి నెట్టిన రాజేష్.. తాను మాత్రం రైలు కింద పడిపోయాడు. యువతికి సృహ వచ్చి లేచి చూసేసరికి రాజేష్ ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐకి తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించే పనిలో పడిపోయారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!