NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
- నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో..
- భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే
- రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం
- విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NZ vs IND 1st ODI: భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 సిరీస్ ముగియడంతో ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరోవైపు సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొరిగా గాయాల కారణంగా సిరీస్ నుండి వైదొలుగుతున్నారు.
ఓపెనర్లుగా రోహిత్, గిల్.. మూడో స్థానంలో కోహ్లీ
తొలి వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో చోటు కోసం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్ మధ్య పోటీ నెలకొంది. టీ20ల్లో ఇషాన్ ఇంజ్యూరీ నుండి కోలుకొని మంచి ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20లోనూ అర్ధసెంచరీ సాధించాడు కూడా. అయితే వన్డేల్లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.
Also Read
- Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
- Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
- AP Muncipal Counting: మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కవచ్చని అంచనా. స్పిన్ బౌలింగ్ చేయగల అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇషాన్, నామన్ ధీర్లలో ఒకరికి అవకాశం రానుంది. మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ కొన్ని సందేహాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఇండియా-A తరఫున న్యూజిలాండ్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో మహమ్మద్ సిరాజ్ ఆడాడు. వరుస మ్యాచ్‌ల నేపథ్యంలో అతడి ఫిట్నెస్, వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని తొలి వన్డేలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సిరాజ్ ఆడకపోతే అర్ష్‌దీప్ సింగ్ పేస్ దళాన్ని ముందుండి నడిపించవచ్చు. గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్, అర్ష్‌దీప్‌కు తోడుగా అన్శుల్ కాంబోజ్ కూడా బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
న్యూజిలాండ్‌కు మరో షాక్..
మరోవైపు న్యూజిలాండ్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. మంగళవారం ఈడెన్ పార్క్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో మాట్ హెన్రీతో ఢీకొనడంతో కాన్వేకు తలకు గాయమైంది. ఈ ఘటనలో ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. హెన్రీ పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తుండగా.. కాన్వేను ఆసుపత్రికి తరలించారు. అతడికి కంకషన్ (తలకు దెబ్బ తగిలిన తర్వాత మెదడుపై ప్రభావం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరి పరిస్థితిని పరిశీలిస్తున్నామని, వన్డే సిరీస్‌లో వారి భాగస్వామ్యంపై తర్వాత సమాచారం ఇస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాన్వే అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీలో మార్పు తప్పనిసరిగా కనిపిస్తోంది. హెన్రీ నికోల్స్ ఒకవైపు ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా.. మరోవైపు టిమ్ సీఫెర్ట్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా కాన్వే స్థానంలో సీఫెర్ట్ ఆడే అవకాశముందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI (అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (C), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (WK), నితీశ్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అన్శుల్ కాంబోజ్.
Glittering trophy, smiling captains 🏆 😊
#TeamIndia is ODI ready 🇮🇳
#NZvIND | @ShubmanGill https://t.co/8rbsJX7VSs
— BCCI (@BCCI) November 3, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
-
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!