South Africa vs India: భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరిగింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగి సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అయితే.. అతనికి గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై బీసీసీఐ అప్‌డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే.. మోకాలి గాయం కారణంగా రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెరిగింది. బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్ చేశాడు.
భారత్- బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అందుకోసం భారత ఆటగాళ్లు నెట్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత జట్టుతో చేరిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే, హార్దిక్ బౌలింగ్ తీరుపై కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కొత్త అవతారమెత్తాడు. రిషబ్ పంత్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడనిది ఈ మ్యాచ్‌లో కనిపించింది. రిషబ్ పంత్ కొన్ని క్షణాలు వేరే అవతారంలో కనిపించాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20ని ప్రారంభించింది. ఈ టీ20 టోర్నమెంట్‌లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఓల్డ్ ఢిల్లీ 6కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే హైలెట్ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ శివమ్ నుండి కొత్త డిమాండ్ ను కోరుతుంది. దూబే తన…
ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేస్తున్నారు.
షాహీన్ వేసిన బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కొంచెం తడబడ్డారు. అతను వేసిన అద్భుత బౌలింగ్తో 5 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాను ఒక్కో పరుగు కోసం కష్టపడేలా చేశాడు. షాహీన్ 5.40 ఎకానమీ రేటుతో 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
Rohit Sharma Bowls in practice session ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, బంగ్లా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం పూణె చేరుకున్న…