South Africa vs India: భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరిగింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్ (8) నిరాశ పర్చాడు. ఇక, క్రీజులోకి వచ్చిన ఓపెనర్ మార్‌క్రమ్ తో కలిసిన కెప్టెన్ బావుమా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Read Also: High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో హై టెన్షన్..
ఇక, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 21 ఓవర్‌లో నాలుగో బంతికి సిక్స్ కొట్టిన బావుమా.. ఆ తర్వాత బంతికే హర్షిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. తెంబా బావుమా (46) హాస్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వరుస వికెట్లు పడుతున్న మార్‌క్రమ్ మాత్రం 88 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్ లో మార్‌క్రమ్ (110) ఔట్ అయ్యాడు. మరోవైపు, టోనీ డి జోర్జీ (17), మార్కో జాన్సెన్ (2) విఫలమైన డెవాల్డ్ బ్రెవిస్ (54), మాథ్యూ బ్రిట్జ్కే (68) ధనాధన్ అర్థ శతకాలతో చెలరేగి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక చివర్లో కార్బిన్ బాష్ అద్భుతమైన విజయాన్ని జట్టుకు అందించడంలో సక్సెస్ అయ్యాడు. కాగా, టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.