బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించి ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని.. రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.
ఎన్నికలు ముగిశాయి.. అందరూ చాలా కష్టబడ్డారని.. మా ఓటమిని అంగీకరిస్తున్నామని తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చామని.. అయితే మరి కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని కొనసాగించాలని మా అభిప్రాయాన్ని చెబుతున్నామన్నారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వెరీ క్లారిటీగా ఉన్నామని.. 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు.
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు.
జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అనే విధంగా పోలింగ్ జరిగింది.. ఇచ్చిన మాట తప్పకుండా జగన్ ఐదేళ్లు పని చేశారు.. ఎన్నికల్లో జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.. మంచి జరిగితే ఓటు వేయాలని జగన్ కోరారు అని గుర్తుచేశారు. విద్య, వైద్యం, పరిపాలనలో సంస్కరణలు కొనసాగిస్తామని జగన్…
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు.
సోమవారం ప్రధాని మోడీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు…
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి, వైసీపీ నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.