తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం…
విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
పచ్చ కామెర్లు ఉన్న వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు 23 స్థానాలకు పరిమితం అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దశల వారీగా మద్యం నియంత్రణ చేస్తాం అన్నాం.. బెల్టు షాపులు తీస్తాం అన్నాం తీశామని మంత్రి పేర్కొన్నారు.
పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో సామాజిక సాధికార యాత్ర సన్నాహా సమీక్ష సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని విమర్శించారు.
నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ…