Botsa Satyanarayana: బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలి..
- బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్‌లో ప్రస్తావించి ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని.. రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హూదూద్ తుఫాన్ తర్వాత వైజాగ్ ల్యాండ్ రికార్డులపై అనేక ఆరోపణలు వచ్చాయని.. 2004నుంచి జరిగిన భూ అవకతవకలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. వైసీపీ హయాంలో వేసిన సిట్ నివేదిక కోసం ఒకటి రెండు సార్లు తాను ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదన్నారు. సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులు ఎవరో బయట పెట్టాలన్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ప్రజలకు అపోహలు కలిగించే ప్రయత్నాలు ఆగాలని కోరుకుంటున్నామన్నారు. బీజెపీ అధ్యక్షురాలు, టీడీపీ స్నేహితులు సన్నిహితులకు చెందిన సంధ్యా ఆక్వా కంపెనీ దిగుమతి చేసిందని ఆరోపణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌పై సమగ్ర విచారణకు ప్రధాన మంత్రికి కూటమి ఎంపీలు లేఖ రాయాలని ఆయన కోరారు. 25 వేల కోట్ల డ్రగ్స్ వ్యవహరం విశాఖ ప్రతిష్టకు దెబ్బతీసేదన్నారు. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రెడ్ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్ బుక్కో తర్వాత.. ముందు మీ చేతుల్లో ఉన్న బుక్కులు తెరిస్తే వైజాగ్ ల్యాండ్ స్కాంపై నిజాలు బయటకు వస్తాయన్నారు. 25వేల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చాయా… లేదా అనేది తేలాలన్నారు. రేపు వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. 45రోజుల పాలనలో జరిగిన హత్యలకు గురైన వాళ్ళ వివరాలను వెల్లడిస్తామన్నారు.
15వేల కోట్లు అప్పా, గ్రాంటా అనేది క్లారిటీ వుండాలని….మాకు తెలిసి అది అప్పు అంటూ మాజీ మంత్రి పేర్కొన్నారు. విభజన హామీల కింద రావాలిసిన నిధులే వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక చాలా అర్థం ఉందన్నారు. రాజకీయాలలో చాలా మందిని కలుస్తారు.. అంత మాత్రాన పార్టీలు విలీనం అయిపోతాయా అంటూ వ్యాఖ్యానించారు. టీచర్ల బదిలీలు అక్రమాలు ఆరోపణలపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. స్కూళ్ళు ఓపెన్ అయిన తర్వాతే బదిలీలు అమలులోకి రావాలని స్వయంగా తానే నోట్ పెట్టానని తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!