Bomb threat: మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్)కి ఆదివారం ఈ-మెయిల్ వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధ్యాహ్నం రెండు ఆస్పత్రులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రాగా.. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Bomb Threat: ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత ఇప్పుడు గుజరాత్‌లోని పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌లు పంపబడ్డాయి. ఇప్పటివరకు సుమారు 7 పాఠశాలలకు బాంబులతో బెదిరింపులు వచ్చాయి.
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.
Mumbai on alert after Bomb Threat Message: వాణిజ్య రాజధాని ముంబైకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ముంబైలోని ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు మెసేజ్‌లో పేర్కొన్నాడు. దీంతో ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దాంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో రామ్ జానకీ ఆదలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆలయాన్ని పేల్చేస్తామని బెదిరిస్తూ ఆలయ గోడలకు, ఆలయంలో పోస్టర్లు వెలిశాయి. ఆలయ ధర్మకర్త బీజేపీ నేత రోహిత్ సాహూకు కూడా ఈ బెదిరింపు లేఖలు వచ్చాయి. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన ఆరు రోజుల తర్వాత ఈ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారాయి.
Ayodhya Ram temple: అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.