ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎన్ఐఏ అధికారులకు బాంబు హెచ్చరిక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తుతో రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి 11:30 గంటల సమయంలో ఫోన్ కాల్ రావడంతో అక్కడ తీవ్ర ఆందోళన రేకెత్తించింది. రాజ్ భవన్ ఆవరణపై బాంబు దాడి చేస్తున్నట్టు అజ్ఞాత…
Bomb Threat: కొచ్చి నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. కొచ్చి విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను పేల్చేందుకు బాంబు అమర్చామని దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. సందర్శకులందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు, బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు తర్వాత పాఠశాల ఖాళీ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలోని ఓ స్కూల్ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో దక్షిణ ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ విద్యార్థులను ఖాళీ చేయించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు.
మహారాష్ట్రలోని పుణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
Moscow-Goa Flight With 244 Onboard Lands In Gujarat After Bomb Threat: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని గుజరాత్ జామ్‌నగర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జామ్ నగర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో…