దేశంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపుల కాల్ వచ్చింది. శుక్రవారం నాడు 177 మంది ప్రయాణికులు, ఒక శిశువుతో శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే.. విమానయాన సంస్థ, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన…
ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఖాళీ చేయించిన సిబ్బంది.
దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే స్కూళ్లు, హాస్పటల్స్, ఎయిర్‌పోర్టు, కేంద్ర హోంశాఖకు కూడా ఈ మెయిల్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది.
దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం బెంగళూరులోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఆ ఆసుపత్రుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లతో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే.. ఈ ఆసుపత్రుల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇది నకిలీ బెదిరింపు అని.. ఆదివారం ఆసుపత్రులకు పంపిన ఈ-మెయిల్‌లో దావా చేయబడిందని పేర్కొన్నారు. ఈ-మెయిల్‌లో.. "నేను మీ భవనంలో పేలుడు…
Bomb Threat : రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Bomb threat: మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్)కి ఆదివారం ఈ-మెయిల్ వచ్చింది.