సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి. తాజాగాఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు ఆందోళన కలిగించింది. బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదర (Delhi – Vadodara)కు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసిఉన్న నోట్ (Bomb Note)ను విమానంలోని లావేటరీలో సిబ్బంది గుర్తించారు.
READ MORE: NVSS Prabhakar: ఉత్తమ్ కుమార్ ఎక్కువ మాట్లాడుతున్నారు.. ప్రభాకర్ ఫైర్
దీంతో ఒక్కసారిగా సిబ్బంది కంగుతిన్నారు. ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదు. ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికుల్ని విమానం నుంచి కిందకు దింపారు. ఎందుకైన మంచిదని భావించిన అధికారులు ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు తీసుకెళ్లారు. మరోవైపు ఘటనపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా.. మూడురోజుల బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మానాశ్రయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్)కి ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 3.05 గంటలకు సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎయిర్ పోర్టుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఏం కనిపించకపోవడంతో ఇది బూటకపు బెదిరింపులుగా తేల్చారు.