Bomb Blast: మ్యాచ్ జరుగుతుండగా బాంబు బ్లాస్ట్.. ఒకరు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast: పాకిస్థాన్ దేశంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ మైదానంలో ఒక భారీ బాంబు పేలుడు సంభవించింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి, ఆ ప్రదేశంలో అతి దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు తీవ్రం కారణంగా ఒక వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం. అలాగే పేలుడు దాటికి పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదకర పేలుడు ఘట్టం అనంతరం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న వీక్షకులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో స్వల్ప తొక్కిసలాటలు కూడా జరిగాయి. పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది.
Crime News: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. తల్లిపై విచక్షణ రహితంగా?
Also Read
ఇక ఈ ఘటనకు సంబంధించి.. బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ ప్రకారం.. ఈ దాడికి ఉపయోగించిన పరికరం ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరంగా నిర్ధారించబడిందని తెలిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, చిన్నారులు సహా అనేక మంది గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. అలాగే భద్రతా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, కొన్ని వారాల క్రితం ఓ పోలీస్ స్టేషన్‌పై క్వాడ్‌కాప్టర్ సహాయంతో ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటనలో.. ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఈ దాడిని ఉగ్రవాద వ్యతిరేక చర్యల భాగంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సర్బకాఫ్’కు ప్రతిస్పందనగా ఉగ్రవాదులు నిర్వర్తించారనే అనుమానం వ్యక్తం అవుతోంది.
Little Hearts : ఓవర్సీస్ లో పవర్ స్టార్ సినిమా కలెక్షన్స్ ని దాటేసిన లిటిల్ హార్ట్స్
This is the menace of Khawarij!At Kausar Ground,Khar,Bajaur,a bomb blast was carried out during a cricket match,targeting innocent civilians.These beasts, who play with the blood of innocents, are the greatest enemies of Islam and humanity.#NoToTerrorism #Bajaur #Pakistan pic.twitter.com/CNnawiXMvt
— Eagle Claw (@EagleClawStrike) September 6, 2025
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?