మాధురీ దీక్షిత్ అనగానే మనకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆమె గొప్ప నటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అంతకంటే ఎక్కువగా మాధురీ అంటే డ్యాన్స్! ఆమె గ్రేస్ మళ్లీ మరెవరికి లభించేది కాదు. అంతలా తన స్టెప్పులతో నిన్నటి తరాన్ని, నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటోంది సీనియర్ సుందరి! మాధురీ లాంటి మాయాజాలం సంజయ్ లీలా బాన్సాలీతో కలిస్తే? ‘దేవదాస్’ చిత్రంలో మనం ఇప్పటికే ఓ సారి అటువంటి అద్భుతం…
2021 ప్రారంభంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టటంతో మార్చ్ నెలకల్లా అనేక సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కానీ, ఏప్రెల్ నుంచీ సీన్ మారిపోయింది. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడటంతో మరోసారి బాక్సాఫీస్ మూతపడిపోయింది. థియేటర్ల గేట్లు తెరుచుకోవటం లేదు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? 2020లో చేసిందే ఇప్పుడూ చేస్తున్నారు. ఓటీటీ వైపు సీరియస్ గా లుక్కేస్తున్నారు. లాస్ట్ ఇయర్…
గత యేడాది కంటే ఈ సంవత్సరం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో వేలాది మంది థియేటర్ల యాజమాన్యం సొంత నిర్ణయంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. విడుదల అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత పడే ఛాయలు కనిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్రసీమ వసూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండగా, గత యేడాదిలో…
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్…
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇప్పుడు యమా బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉండగా, రాజ్, డీకే కొత్త చిత్రంతో పాటు సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ రీమేక్ కూ షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శశాంక్ ఖైతాన్ ‘యోధా’ చిత్రం నుండి షాహిద్ తప్పుకోవడం కూడా బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. దానికి అసలైన కారణం ఇదీ అని తెలియకపోవడంతో దర్శకుడు మాత్రం తన వంతు ప్రయత్నం…
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. చిత్రపరిశ్రమ స్థంబించిపోతోంది. దేశంలోని అన్ని చిత్రరంగాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పలువురు తారలు విహారయాత్రలకు బయలుదేరారు. కొందరు అప్పుడే వెళ్ళి వచ్చారు కూడా. అయితే వీరు అలా విహారయాత్రలలో మునిగి తేలుతున్న తారలు తమ తమ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయటంపై ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్ అవుతున్నాడు. దేశం మొత్తం కరోనాతో విలవిలలాడుతూ… ఓ వైపు జనాలు వైద్యం అందక, ఉపాధి…
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పావ్రీ హో రహీ హై’ ట్రెండ్ నడుస్తోంది. ‘బాయ్స్’ బ్యూటీ జెనీలియా కూడా తన ‘పావ్రీ హో రహీ హై’ వీడియో అప్ లోడ్ చేసింది. కానీ, పెద్ద ట్విస్ట్ ఉంది స్టోరీలో! పిల్లల కోసం రిస్క్ చేసి… పాపం మన లవ్లీ మమ్మీ… పెద్ద కష్టమే తెచ్చి పెట్టుకుంది! జెనీలియా ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. పెద్ద తెరపై కొన్నాళ్లుగా పెద్దగా కనిపించటం లేదు ఈ బ్యూటీ.…