కంగనాకి కూడా కరెన్సీ కష్టాలు తప్పటం లేదు! కారణం అంటారా… ఏముంది, కరోనా మహమ్మారే! ఈ మద్యే ఆమెకు వైరస్ సోకింది. త్వరగానే బయటపడింది మన స్ట్రాంగ్ లేడీ. అయితే, బాలీవుడ్ ‘క్వీన్’కి కరోనా వల్ల ఆరోగ్య సమస్యలే కాదు ఆర్దిక సమస్యలు కూడా తప్పటం లేదట. పోయిన సంవత్సరం ట్యాక్స్ కూడా తాను ఇంత వరకూ పూర్తిగా పే చేయలేదని ప్రకటించింది బీ-టౌన్ ‘తలైవి’! కంగనా ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న యాక్టర్. ఆమెతో సినిమా తీసేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపుతుంటారు. అంతే కాదు, కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది కంగనా. అయితే, బీ-టౌన్ బ్యూటీస్ లో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమె దాదాపు 45 శాతం వరకూ తన ఆదాయంలో ట్యాక్స్ గానే కట్టాలట.
2020లో పెద్దగా షూటింగ్ లు లేకపోవటంతో రాబడి తగ్గింది అంటోంది ‘ఏక్ నిరంజన్’ సుందరి. దాంతో ఈ సంవత్సరం కూడా మళ్లీ లాక్ డౌన్ నేపథ్యంలో ట్యాక్స్ చెల్లించటం ఇబ్బందిగా మారిందట. మరో ట్విస్ట్ ఏంటంటే… గవర్నమెంట్ తాను కట్టని ట్యాక్స్ పై వడ్డీ కూడా వేస్తోందని కంగనా తెలిపింది! కానీ, ప్రభుత్వానికి, దేశానికి చెల్లించే సొమ్ము విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆమె ముక్తాయింపునిచ్చింది…మనసులో ఏది ఉంటే అదే మాట్లాడే తత్వం కంగనాది. కాబట్టి ఆమె ట్యాక్స్ కష్టాల విషయంలో నిజమే చెబుతోందని భావించవచ్చు. కాకపోతే, ప్రస్తుతం ‘తలైవి’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోన్న కంగనా నెక్ట్స్ ‘తేజస్, దక్కడ్, మణికర్ణిక రిటర్న్స్’ వంటి క్రేజీ సినిమాలతో హల్ చల్ చేయబోతోంది. మరి అప్పుడు మన ‘మణికర్ణిక’కి మనీ కష్టాలు ఉంటాయా? అఫ్ కోర్స్, ఉండకపోవచ్చు…