బాలీవుడ్ లో డింపుల్స్ అనగానే ఎవరికైనా ఇప్పుడు దీపికా పదుకొణేనే గుర్తుకు వస్తుంది! ముంబైలో నంబర్ వన్ బ్యూటీగా రాజ్యమేలుతోన్న రాణీ ‘పద్మావతీ’ నవ్విందంటే మాత్రం అంతే! ఎంతటి వారైనా మన టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సొట్ట బుగ్గుల సొగసుకి దాసోహమైపోతారు!
బోలెడు హారర్ చిత్రాలు చేసిందిగానీ… హాట్ బెంగాలీ బ్యూటీ బిపాషా… సూపర్ సెక్సీ! ఆమె అందానికి తగిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ తన కెరీర్ లో పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక బిప్స్ బ్యూటిఫుల్ మ్యాజిక్ కి యాడెడ్ అట్రాక్షన్… ఆమె డింపుల్స్! బిపాషా బసు నవ్విందంటే… కుర్రాళ్ల బతుకు బస్టాండే!
తెలుగులోనూ సినిమాలు చేసిన నిన్నటి తరం సొట్ట బుగ్గల సొగసరి… ప్రీతి జింతా. నిస్సందేహంగా ఆమె బుగ్గపై ఆ బ్యూటిఫుల్ లోతులు… బాయ్స్ ని తెగ కలవర పెట్టేయి అప్పట్లో! ఇప్పటికీ ఈ క్యూట్ డింపుల్ క్వీన్ తిరిగి సినిమాల్లోకి వచ్చేయాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు!
ప్రీతి జింతా, బిపాషా, దీపికా… వీళ్లే కాదు… ఇంకాస్త లెటెస్ట్ గా వచ్చిన యంగర్ బ్యూటీ, ఆలియా కూడా ఆహా అనిపిస్తోంది. అందం, అభినయం రెండూ ఉన్న మన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీకి చెంపలపై ఆ చిరు లోయలు… అదనపు ఆకర్షణ! ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులు గార్జియస్ ‘గంగూభాయ్’ని నెత్తిన పెట్టేసుకున్నారు. త్వరలో ‘ట్రిపుల్ ఆర్’తో తెలుగు తెరపైకి కూడా వస్తోంది. మన ఆడియన్స్ సైతం ఆలియా డింపుల్స్ కి ఫదా అవ్వటం, ఖాయమే!
బాలీవుడ్ లో సొట్ట బుగ్గలన్నీ హీరోయిన్స్ సొగసుల్లోనే ఒదిగిపోయాయి అనుకుంటే పొరపాటే! హ్యాండ్సమ్ యాక్టర్స్ కూడా తమ సింపుల్ డింపుల్స్ తో ఇట్టే ఆకర్షిస్తున్నారు. వాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ముగ్గురు… షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహాం, అభయ్ డియోల్! బాద్షా బుగ్గల సంగతి తెలిసిందే! కండల వీరు జాన్ అబ్రహాం, హైలీ టాలెంటెడ్ అభయ్ డియోల్ కూడా ఫ్యాన్స్ ని డింపుల్స్ తో పడగొట్టేస్తుంటారు! ముఖ్యంగా… ఫీమేల్ ఫ్యాన్స్…