Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు.
ఒకప్పుడు నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించిన ఇలియానా డి'క్రుజ్ ఇప్పుడు ముద్దుగా బొద్దుగా తయారయింది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఉత్తరాదికి ఉరకలు వేసి, దక్షిణాదిపై - ముఖ్యంగా తనకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన టాలీవుడ్ పై కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమె పఠాన్ గురించి సానుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
లెజండరీ స్టంట్ కొరియోగ్రాఫర్ జూడో కె.కె. రత్నం వయోథిక సమస్యలతో కన్నుమూశారు. వివిధ భాషల్లో 1200 చిత్రాలకు స్టంట్స్ సమకూర్చిన ఆయన దక్షిణాదిలోని టాప్ హీరోస్ అందరితోనూ వర్క్ చేశారు.
తెలుగునాట మేటినాయికగా రాణించిన జమున హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. తెలుగులో విజయాసంస్థ నిర్మించిన 'మిస్సమ్మ'లో సావిత్రి చెల్లెలుగా జమున నటించారు.