Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra Reveals Why She Left Bollywood: తమ కెరీర్‌కి మెరుగులు దిద్దిన ఇండస్ట్రీ గురించి కొందరు భామలు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి చెక్కేసిన కథానాయికల్లో కొంతమంది తెలుగు చిత్ర పరిశ్రమని హేళన చేసిన సంగతి తెలిసిందే! గ్లామర్ షో తప్ప ఏమీ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా కూడా అలాంటి వారి జాబితాలోకి చేరింది. హాలీవుడ్‌కి తన మకాం మార్చిన ఈ భామ.. తనకు అవకాశాలు ఇచ్చి, స్టార్డమ్ సాధించిపెట్టిన బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో తనకొచ్చిన ఆఫర్ల పట్ల సంతోషంగా లేనని, అక్కడ రాజకీయాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ బాంబ్ పేల్చింది. తాను అభద్రతాభావానికి గురవ్వడం వల్లే.. బాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టింది.
Honey Rose: దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో నన్ను ఒక మూలన పడేశారు. నాకు కొందరితో విభేదాలు ఏర్పడటం వల్ల.. అవకాశాలు రాకుండా చేశారు. ఆ ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఆ పాలిటిక్స్ చేయడం తెలీదు. ఆ రాజకీయాలతో నేను విసిగెత్తిపోయి, బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే తాను ఒక మ్యూజిక్ వీడియో చేయగా, దాన్ని అంజులా ఆచార్యా (ప్రస్తుతం ప్రియాంకా మేనేజర్) చూసి తనని సంప్రదించిందని తెలిపింది. యూఎస్‌లో మ్యూజిక్ కెరీర్ ప్రారంభిస్తావా? అని ఆఫర్ చేయడంతో, వెంటనే ఒప్పుకున్నానంది. అదే తన కెరీర్‌కి మెరుగులు దిద్దిందని, సరికొత్త ప్రపంచానికి (హాలీవుడ్)కి పరిచయం చేసిందని పేర్కొంది. ఇక అప్పుడే తాను అమెరికాకు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. తన మ్యూజిక్ కెరీర్ వల్లే ‘క్వాంటికో’లో నటించే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
Extramarital Affair: మరొకరితో భార్య ఎఫైర్.. భర్తకు తెలిసి ఏం చేశాడో తెలుసా?
కాగా.. క్వాంటికో సిరీస్ ద్వారా గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించిన ప్రియాంకా.. ఆ తర్వాత బేవాచ్, మ్యాట్రిక్స్, ద వైట్ టైగర్ వంటి సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది. త్వరలోనే సిటాడెల్ సెకండ్ షో, లవ్ ఎగైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాలీవుడ్‌కి మకాం మార్చిన తర్వాత నిక్ జోనస్‌తో పరిచయం అవ్వడం, అది ప్రేమగా మారడంతో.. అతడ్ని 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?