Shefali Shah Talks About Her Bad Experience: సినీ తారల జీవితాల్లో కేవలం వెలుగులే కాదు, చీకటి కోణాలు కూడా ఉంటాయి. వెళ్లిన ప్రతీచోటా వీరికి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆయా సమయాల్లో కొందరు చాకచక్యంగా వ్యవహరించి వెంటనే యాక్షన్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం ఏం చేయలేక మౌనంగానే ఉండిపోతారు. తాను ఆ రెండో కోవకి చెందినదాన్నని తాజాగా బుల్లితెర నటి షెఫాలీ షా బాంబ్ పేల్చింది. గతంలో తనకు ఊహించని ఒక చేదు అనుభవం ఎదురైందని, అయితే ఆ సమయంలో తాను ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయాయని వెల్లడించింది. అలాంటి ధోరణికి ఇప్పుడు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని నేటి తరం అమ్మాయిలను సూచించింది.
Kangana Ranaut: ముందుంది ముసళ్ల పండగా.. ఆ నిర్మాతకి కంగనా వార్నింగ్
ఓ పాడ్‌క్యాస్ట్‌లో షెఫాలీ మాట్లాడుతూ.. ‘‘ప్రతిఒక్కరూ తమతమ జీవితాల్లో ఏదో ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు నేను ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గురించి చెప్పబోతున్నాను. మొదట ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకున్నా. కానీ, ఇప్పుడు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. నేను ఒకరోజు బాగా రద్దీగా ఉన్న మార్కెట్‌కి నడుచుకుంటూ వెళ్లాను. ఆ సమయంలో ఎవరో నన్ను అభ్యంతకరీతిలో తాకారు. ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారు. అప్పుడు నాకు చాలా కంపరంగా అనిపించింది. నేను గిల్టీగా ఫీలవ్వడం కాదు కానీ, ఇది నిజంగా సిగ్గుచేటు. అయితే.. ఆ సమయంలో నేను ఆ పనికిమాలిన పనికి పాల్పడిన వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయా. దాన్ని నేను అలాగే వదిలేశాను. ఇలాంటివి ఎదురైనప్పుడు.. తమదే తప్పు అన్నట్టుగా ఫీలయ్యి, చాలామంది అమ్మాయిలు దాన్ని మర్చిపోతుంటారు. అలాంటి ధోరణికి మనం చెక్ పెట్టాలి. దాని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే.. అలాంటి చేదు అనుభవాలు ఎదురైతే, నిర్భయంగా ఎదురు తిరగాలని షెఫాలీ సూచించింది.
Balochistan Bomb Blast: బలూచిస్తాన్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 18 మందికి గాయాలు
ఇదిలావుండగా.. 1995లో వచ్చిన రంగీలా సినిమాతో షెఫాలీ షా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సత్య సినిమాలో నటించిన ఆమెకు, ఉత్తమనటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతోంది. ఢిల్లీ క్రైమ్, హ్యూమన్ వెబ్ సిరీస్‌లలో నటించి.. మంచి మార్కులు కొట్టేసింది. గతేడాదిలో వచ్చిన డార్లింగ్స్ సినిమాలో ఓ యువ నటుడితో లిప్ లాక్ సీన్‌లో నటించి, టాక్ ఆఫ్ ది టౌన్‌గానూ మారింది.