సాధారణంగా పిల్లలను ముద్దు చేస్తూ.. వారితో సరదాగా ఉంటూ పిల్లలను ముద్దులు ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు ముద్దులు ఇస్తూ వాళ్ల దగ్గర కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే చిన్న పిల్లలకు పేదాల మీద చాలా రేర్ గా ముద్దు పెడుతుంటారు. మనకు తెలిసినంతలో.. మన చుట్టూ చిన్నపిల్లలు ఎవరైనా సరే వారికి లిప్ కిస్ ఇవ్వరు.. తాజాగా బాలీవుడ్ యాక్టర్ ఛవి మిట్టల్ తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Bala Krishna: బాలయ్య దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి
అయితే ఆ ఫోటోలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడమేంటి, వాళ్లకు ఇప్పట్నుంటే ఏం నేర్పిస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది పిల్లలకు మీ బ్యాక్టీరియాని పంచుతున్నారు, ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలకు లిప్ కిప్ ఇస్తున్న ఫోటోలను ఛవి మిట్టల్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కు గురైంది. మాములు నెటిజన్స్ కాకా కొంతమంది ప్రముఖులు కూడా ఆమె చర్యని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నువ్వు వాళ్లకు ఇలా లిప్ కిస్ ఇచ్చినా అందరికీ తెలిసేలా ఇలా పెట్టాలా అంటూ కొంతమంది ప్రముఖులు మండిపడుతున్నారు.
Also Read : Vizag Saradapeetam: ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు భేష్
ఈ ట్రోల్స్ అన్ని చూసి ఛవి మిట్టల్ ఆగకుండా మరిన్ని లిప్ కిస్ ఫోటోలు షేర్ చేసింది. ఒక తల్లి చూపించే ప్రేమకి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ఊహించలేదు.. నేను నా పిల్లలను ముద్దులు ఇస్తున్న మరి కొన్ని కూడా షేర్ చేస్తున్నాను అంటూ ఛవిమిట్టల్ పేర్కొంది. ఎందుకంటే వారిపై నాకున్న అమితమైన ప్రేమను ఎలా చూపించాలో తెలియదు.. ఇదొక పద్దతి.. కౌగిలింతలు.. ముద్దులతో వారిపై నాకున్న ప్రేమను చూపిస్తానంటూ ట్వీట్ చేసింది. నాపై వచ్చిన ట్రోల్స్ కి నాకు సపోర్ట్ గా నిలిచినవాళ్లకు థ్యాంక్యూ.. ఇంకా మానవత్వం బతకే ఉంది.. ఇలా అనే వాళ్లు తమ పిల్లలపై ప్రేమను ఎలా చూపిస్తారో తెలియజేయండి అని కౌంటర్ ఇచ్చింది. అలాగే కొంతమంది తనకు తెలిసిన వాళ్లు అంతా తమ పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తూ ఆ ఫోటోలను ఛవి మిట్టల్ తో కలిసి షేర్ చేస్తూ ఆమె పోస్ట్ కు సపోర్ట్ చేస్తున్నారు.