‘క్రిష్’ చిత్రం విడుదలై పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యేడాది జూన్ 23న ‘క్రిష్ -4’ మూవీ గురించి అధికారిక ప్రకటన చేశాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ బిజీగా ఉన్నారు. ‘క్రిష్’ సీరిస్ చిత్రాలన్నింటికీ హృతిక్ పెదనాన్న రాజేష్ సంగీతం అందించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ‘క్రిష్ -4’కూ ఆయనే స్వర రచన చేస్తున్నారు. ఈ విశేషాలను రాజేష్ తెలియచేస్తూ,…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ.. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు పారేస్తూ.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన…
(అక్టోబర్ 6న వినోద్ ఖన్నా జయంతి) హిందీ చలనచిత్రసీమలో వినోద్ ఖన్నా స్థానం ప్రత్యేకమైనది. ప్రతినాయక పాత్రల్లో అడుగు పెట్టి సూపర్ స్టార్ గా అలరించిన నటుడు వినోద్ ఖన్నా. మధ్యలో ఐదేళ్ళు ‘ఓషో’ మార్గం పట్టి సినిమారంగాన్ని వీడినా, మళ్ళీ వచ్చి నటునిగా రాణించారు వినోద్ ఖన్నా. రాజకీయాల్లోనూ ప్రత్యేక బాణీ పలికించారు వినోద్. నాలుగు సార్లు ఒకే నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికై, కేంద్రమంత్రిగానూ రాణించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారాయన. వినోద్…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్సీబీ కోర్టు. ఈనెల 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉంచాలని ఎన్సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ మరో మూడు రోజుల పాటు కస్టడీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్…
బాలీవుడ్ హ్యాండ్ సమ్ హాంక్స్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ కలయికలో సినిమా ఖాయం అని తేలింది. శనివారం వీరిద్దరూ ఓ నిర్మాతను కలిశారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వారిద్దరి కలయికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. హృతిక్, రణబీర్ నమిత్ మల్హోత్రా కార్యాలయాన్ని సందర్శన వారు తీస్తున్న పురాణ కథ ‘రామాయణం’ కోసమే అని అందరూ నమ్ముతున్నారు. నమిత్, మధు మంతెన,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018 లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈ దంపతులకి ఒక పాప పుట్టగా,…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీపై రెయిడ్ చేసిన అధికారులు ఆర్యన్ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ ని కేవలం విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నామని.. అతడిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు, కేసు నమోదు కాలేదని ఎన్సీబీ అధికారులు…
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’.. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1960లలో ముంబై రెడ్‌లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన గంగూభాయ్ కతియావాడీ బయోపిక్ పాత్రలో గంగూభాయ్ గా ఆలియాభట్ నటించింది. 2019, డిసెంబర్ 8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించగా, రీసెంట్ గా సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్డౌన్, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదల…
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న టెర్రర్ మీడియా థ్రిల్లర్ ‘థమాకా’ మూవీపై అతని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ మధ్వానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు బేస్ 2013లో వచ్చిన కొరియన్ మూవీ ‘ది టెర్రర్ లైవ్’. ఓ బ్రిడ్జ్ ను బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టుని యంగ్ జర్నలిస్ట్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. దాంతో అతనికి బెదిరింపులు రావడం మొదలవుతుంది. ఊహించని ఈ ఉపద్రవం నుండి ఆ జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటికే కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. తాజాగా దీపావళీ పండక్కి థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే థియేటర్లను తిరిగి తెరుస్తామని ప్రకటించడంతో దర్శకుడు రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రాన్ని థియేటర్లో విడుదల…