బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ- కత్రినా ల పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 9 న రాజస్థాన్ లోని అతి కొద్ది మంది అతిథుల నడుమ వీరి పెళ్లి జరింగింది. ఆ తరువాత వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది అని అనుకొనేలోపు ఈ కొత్త జంట అందరికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత నో రిసెప్షన్.. నో హనీమూన్ .. ఓన్లీ వర్క్ అంటున్నారట ఆడోరబుల్ కపుల్.. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్.. ఇద్దరి చేతిలోనూ రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఎక్కువ రోజులు వీరు షూటింగ్ కి గ్యాప్ ఇస్తే సినిమాల విడుదల ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వారు తమ వైవాహిక జీవితాన్ని పక్కనపెట్టి ప్రొఫెషనల్ గా ఉండాలనుకుంటున్నారట.
డిసెంబర్ 20 నుంచీ 50 రోజుల పాటూ సుదీర్ఘ షెడ్యూల్ లో విక్కీ ఉండగా.. క్యాట్ సైతం తాను ఒప్పుకొన్న సినిమాలను పూర్తిచేయడానికి బయల్దేరనున్నదట. దీంతో పెళ్లై రెండు రోజులు కూడా గడపకముందే వీరిద్దరూ దూరం కావాల్సివస్తుంది అని అంటున్నారు బాలీవుడ్ వర్గాలు.. ఇక ఈ జంట కలుసుకొనేది మళ్లీ 2022 లోనే.. మరి అప్పుడైనా ఈ జంట బాలీవుడ్ పెద్దలకు పార్టీ ఇస్తారా..? లేదా అనేది చూడాలి.