బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు వారికి కూడా రణబీర్ పరిచయస్తుడే.. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంతో అన్ని భాషల్లోనూ సుపరిచితుడు కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కి పరిచయమైనా రణబీర్ మాత్రం మొదట స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మెళుకువలు నేర్చుకున్నాడు. తాజాగా అప్పటి రోజులు గుర్తు తెచ్చుకున్నాడు చాక్లెట్ బాయ్. డైరెక్టర్ వద్ద పనిచేసేటప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు.
‘‘రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్ ’’ బుక్ ని లాంచ్ చేసిన రణబీర్ మాట్లాడుతూ” నేటి తరం దర్శకులు కమర్షిమల్ చిత్రాలకే మొగ్గుచూపుతున్నారంటే నేను నమ్మను.. ఎంతో నిబద్దతో వారు పని నేర్చుకుంటున్నారు. గతంలో నేను బన్సాలి వద్ద బ్లాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ సమయంలో గంటల తరబడి మోకాళ్ళ మీద కూర్చొనేవాడిని.. సంజయ్ లీలా భన్సాలీకి కోపం వస్తే తిట్టేవాడు..ఇంకా ఎక్కువ కోపం వస్తే కొట్టేవాడు.. కానీ, అప్పటి ఈ చేదు అనుభవాలు ముందు ముందు బయట ప్రపంచంలో బతకడానికి ధైర్యాన్నిస్తాయి అని చెప్పుకొచ్చాడు.