బాలీవుడ్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటైనా విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట కొత్త కాపురాన్ని మొదలుపెట్టేశారు. కత్రినా కొత్త కోడలు హోదాలో అత్తవారింట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా కొత్తకోడలు ఆచరిసిన్హాల్సిన పద్దతులను తూచా తప్పకుండా పాటిస్తోంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన వెంటనే ఆమె చేతితో స్వీట్ చేసి కుటుంబానికి తినిపించింది. ఈ విషయాన్నీ కత్రినా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోంది.
తీయటి హాల్వా ఫోటోను షేర్ చేస్తూ నేనే చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక భార్య స్వీట్ తిన్న విక్కీ, క్యాట్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.. నా జీవితంలో తిన్న హల్వా లలో ఇదే బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. ఇంతకన్నా భార్యకు ఇచ్చే అతిపెద్ద ప్రశంస ఉండదని అభిమానులు అంటున్నారు. ఏదిఏమైనా పెళ్ళికి ముందు ఏమి మాట్లాడని ఈ జంట.. పెళ్లి తరువాత తమ జీవితంలో జరిగే అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు.
damn I'm so invested in them like I mean THIS MUCH!!
— nidhi🤍✨️ (@nidhicreationsx) December 17, 2021
#KatrinaVickyKiShaadi #VicKat #KatrinaKaif #VickyKaushal pic.twitter.com/Np76rXn8Kl