“మీ పేరు?” “బొబ్బిలిపులి” “అసలు పేరు?” “బొబ్బిలిపులి” – కోర్టు హాల్ లో శ్రీదేవి ప్రశ్న, యన్టీఆర్ సమాధానం… ఇలా సాగుతున్న సీన్ లో ఏముందో, ఆమె ఏమి అడుగుతోందో, ఆయన ఏం చెబుతున్నారో తెలియకుండా ‘బొబ్బిలిపులి’ ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్ కు కేకలు మారుమోగి పోయేవి. అసలు యన్టీఆర్ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చే టప్పటి నుంచీ ఆయన నోట వెలువడిన ప్రతీ డైలాగ్ కు జనం చప్పట్లు, కేరింతలు, ఈలలు సాగుతూనే ఉన్నాయి. దాదాపు…
ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన…