Boat Sink : పశ్చిమ ఆఫ్రికా నుండి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిపోయినప్పుడు 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు. ఈ పడవ జనవరి 2న బయలుదేరి గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది.
కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. రాజధాని కిన్‌షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడిపోయినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి తెలిపారు.
Boat Sink: పడవ మునిగి 90 మంది మరణించారు. ఈ విషాదకర సంఘటన మొజాంబిక్‌లో చోటు చేసుకుంది. ఆ దేశ ఉత్తర తీరంలో పడవ మునిగిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు…
గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు…
Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది.