Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Sink: పడవ మునిగి 90 మంది మరణించారు. ఈ విషాదకర సంఘటన మొజాంబిక్‌లో చోటు చేసుకుంది. ఆ దేశ ఉత్తర తీరంలో పడవ మునిగిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపుగా 130 మందితో ఉన్న ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Himachal Pradesh: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరు మృతి, పలు వాహనాలు దగ్ధం
Also Read
బోటులో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటం, ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి అనువుగా లేకపోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు, ఈ ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారని నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. రెస్క్యూ కార్యక్రమాల్లో ఐదుగురిని ప్రాణాలతో రక్షించారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. అయితే, సముద్రంలోని పరిస్థితులు కష్టంగా ఉండటంతో రెస్క్యూ కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చాలా మంది ప్రయాణికులు కలరా గురించి తప్పుడు సమాచారం కారణంగా భయాందోళనలతో ప్రధాన భూభాగాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత పేదదేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో అక్టోబర్ నుంచి దాదాపుగా 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. వీరిలో 32 మరణాలు సంభవించాయి. ఎక్కువగా నంపులా ప్రావిన్స్ ప్రభావితమైంది. కలరా కేసుల్లో మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- Africa
- boat sink
- Cholera
- Mozambique
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!