2025 లో, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్ లో హల్ చల్ చేశాయి. BMW iX1 LWB, కొత్త 2 సిరీస్ గ్రాన్ కూపే, సరికొత్త X3 వంటి అనేక మోడళ్లను ప్రవేశపెట్టింది. వోల్వో EX30 e-SUV లతో పాటు XC90, XC60 ఫేస్‌లిఫ్ట్‌లతో కూడా అదే బాట పట్టింది. అయితే, 2026 సంవత్సరం యాక్షన్-ప్యాక్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. రాబోయే సంవత్సరంలో మార్కెట్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి లగ్జరీ కార్లు. లిస్ట్ లోబీఎండబ్ల్యూ,…
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపుల్తో సతమతౌతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేటయ్యింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు నెక్ట్స్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్‌కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న…
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత్‌లో తన వాహన శ్రేణిలోని అన్ని కార్ల ధరలను 3 శాతం పెంచినట్లు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగానే ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు. దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్…
BMW M340i: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ కారును రూ. 72.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేసింది. ఇందులో హెడ్‌ల్యాంప్‌ల కోసం M లైట్ షాడోలైన్ ముగింపు, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో 19-అంగుళాల జెట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ (995M)తో వస్తుంది. షార్పర్ బంపర్ డిజైన్, బ్లాక్ మెష్ కిడ్నీ గ్రిల్, డ్యూయల్-ఎగ్జాస్ట్ టిప్స్, బ్లాక్-అవుట్ ORVMలు…
BMW M4 CS Launch: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ సరికొత్త కారును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ‘ఎం4 సీఎస్’ పేరుతో కొత్త కారును రిలీజ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). భారత మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ ఇదే కావడం విశేషం. సీఎస్ (కాంపిటీషన్ స్పోర్ట్) మోడల్ కంటే ఎం4 సీఎస్ ధర రూ. 36 లక్షలు ఎక్కువ.…
BMW CE 04 Electric Scooter Price in India: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరిట స్కూటర్‌ను తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా విద్యుత్తు కార్లు విక్రయిస్తున్న బీఎండబ్ల్యూ సంస్థ.. ద్విచక్ర వాహనాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. సీఈ 04 స్కూటర్ ధర ధర రూ.14.9 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూంలో) ఉంది. ఈ ధర చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు.…
BMW 5 Series LWB: జర్మన్ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ భారతదేశంలో కొత్త 5 -సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్ ను విడుదల చేసింది. ఈ వాహనం రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ ను పొందిన మొదటి మార్కెట్ భారతదేశం. బిఎండబ్ల్యూ 5 సిరీస్ LWB 4 రంగులలో కారును అందించబడుతుంది. మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, M కార్బన్ బ్లాక్, స్పార్క్లింగ్ కాపర్ గ్రే లలో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే దీని…