రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
READ MORE: Bangladesh: హిందువులపై జరుగుతున్న దాడిలను ఖండించిన ముస్లిం నేతలు.. యూనస్‌కు లేఖ
స్థానికుల కథనం ప్రకారం.. బీఎండబ్ల్యూ కారు అతివేగంతో వచ్చింది. అకస్మాత్తుగా టాటా పంచ్ కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల జనాలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. స్పోర్ట్స్ కారు నుంచి డ్రైవర్‌ను బయటకు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన కార్లను రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రాంతం రద్దీగా ఉండడంతో ప్రమాదం పెను ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు. డ్రైవింగ్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపడం మానుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
READ MORE:RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
అయితే.. ఈ ప్రమాదంలో టాటా పంచ్ కారు స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. బీఎండబ్ల్యూ కారు బాగా దెబ్బతింది. దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు వైరల్‌గా మారాయి. టాటా డిల్డ్ క్వాలిటీ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ కంపెనీ కార్ అయినా.. టాటా క్వాలిటీకి సలాం కొట్టాల్సిందే అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.