మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఆశలన్నీ కిషోర్ తిరుమల సినిమాపైనే పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో చేస్తున్నాడు.ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది.
Also Read : TheRajaSaab : రాజాసాబ్.. నాచే నాచే సాంగ్.. రాసి పెట్టుకోండి.. థియేటర్లు తగలబడిపోతాయ్!
జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ చేసిన వామ్మో వాయ్యో వీడియో సాంగ్ సినిమాపై కాస్త బజ్ పెంచింది. కానీ ఆ బజ్ ను మెయింటెయిన్ చేయడంలో తడబడుతోంది భర్త మహాశయులకు విజ్ఞప్తి టీమ్. ఈ సారి పొంగల్ బరిలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ తో పాటు మెగాస్టార్ – అనిల్ రావిపూడి ‘ మన శంకరవరప్రసాద్ గారు’ తో కలిసి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజుతో ఆడియెన్స్ ను పలకరించేందుకు వస్తున్నారు. మిగతా అన్ని సినిమాలు ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్తున్నాయి. రోజు ఎదో ఒక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎందుకనో ఇక్కడ కాస్త నెమ్మదిగా వెళ్తోంది. బహుశా రిలీజ్ కు ముందు అనవసరమైన హైప్ ఎందుకని భావిస్తున్నారో ఏమో. కానీ పోటీలో భారీ సినిమాలు ఉన్నప్పుడు ప్రమోషన్స్ గట్టిగా ఉండాలి లేదంటే ఆ సినిమాల తాకిడిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి బాగున్నా కూడా ఆడియెన్స్ దూరంగా ఉండే అవకాశం ఉంది. 7వ తేదీ ఈ సినిమా ట్రైలర్ రాబోతుంది. అప్పటి నుండైనా మేకర్స్ ప్రొమోషన్స్ లో జోరు పెంచుతారేమో చూడాలి.