Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటో బేరం వచ్చిందని ఒక వ్యక్తి సంతోషంగా వెళ్లాడు.. అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు.. ఒక రోజంతా చూశారు.. అయినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సరిగ్గా నాలుగు రోజులకు అదే వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. అందునా దారుణంగా హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అసలు ఆ చెరువు వద్దకు ఎందుకొచ్చాడు.. ఆ యువకుని చావుకు చేతబడికి ఏమైనా సంబంధం ఉందా.. ఇదే ఆ హత్య కేసులో అసలైన మిస్టరీ.. ఆ యువకుని చావుకు కారణాలేంటి? అనంతలో సంచలనం కలిగించిన సంఘటన ఇది.
టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. ప్రజలను ఇంకా మూఢ విశ్వాసాలు వీడటం లేదు.. ఆకాశంలోకి రాకెట్ల పంపి ప్రయోగాలు చేస్తున్నా.. ఇంకా క్షుద్ర పూజలు, చేతబడులు అంటూ జనం అంధకారంలో ఉంటున్నారు. వారు అంధకారంలో ఉండటమే కాదు.. ఆ విశ్వాసాలతో దారుణాలకు పాల్పడుతున్నారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన మనుషులు ఇంకా ఎంత అంథ విశ్వాసంలో ఉన్నారో తెలియజేస్తోంది. .. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం చెరువులో ఒక మృత దేహం కనిపించింది. బాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. మృతదేహం గుర్తు పట్టలేని పరిస్థితులో ఉంది.కానీ అప్పటికే మిస్సింగ్ కేసులో ఉన్న ఒక వ్యక్తి పొలికలకు ఇది సరిపోయింది. దీంతో ఆ వ్యక్తి బంధువులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు అది చూసి ఘొల్లుమన్నారు.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఈ మృతదేహం ఎస్కే యూనివర్శిటీ సమీపంలో ఉండే నాగేశ్వరనాయక్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఎక్కడో ఆకుతోటపల్లిలో ఉండాల్సిన వ్యక్తి ఇంతదూరం ఎలా వచ్చాడని ఆరా తీస్తే దాని వెనుక చాలా దారుణమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన నాగేశ్వర నాయక్ స్వగ్రామం కదిరి మండలం ఏటిగడ్డపల్లి తండా. అయితే ఏడాది క్రితం ఆకుతోటపల్లికి వచ్చి.. నివాసముంటున్నాడు. ఏడునెలల కిందట నాగేశ్వర్ నాయక్ కు ప్రియాంకతో వివాహమైంది. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు బాలమ్మ, నారాయణస్వామినాయక్ స్వగ్రామంలోనే ఉన్నారు. అయితే ఈనెల 25న ఆటో బాడుగ ఉందని.. ధర్మవరం వెళ్లాలని భార్యకు చెప్పి వెళ్లాడు.. అంతే అలా వెళ్లిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు. ఇలా శవమై కనిపించాడు. తన కుమారుడిని ఏటిగడ్డ తండాకు చెందిన కృష్ణానాయక్ చంపించాడని తండ్రి నారాయణస్వామి నాయక్ ఆరోపించాడు. పోలీసులు దీనిపై ఫిర్యాదు అందుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
అసలు నాగేశ్వరనాయక్ ను ఎవరు చంపారు.. ఎందుకు చంపారంటే..? దీని వెనక ఇంకో దారుణమయిన కథ ఉంది. కదిరి మండలం ఏటిగడ్డ తండాకు చెందిన కిరణ్ అనే 15 ఏళ్ల బాలుడు ఏడాది క్రితం మృతిచెందాడు. ప్రస్తుతం హత్యకు గురైన నాగేశ్వర నాయక్ తల్లి బాలమ్మ అనే మహిళ చేతబడి చేయడం వల్లే తన కుమారుడు కిరణ్ మృతి చెందాడని గొడవలు జరిగాయి. గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. చేతబడి ఆరోపణ రావడంతో బాలమ్మ, ఆమె భర్త నారాయణస్వామినాయక్, కుమారుడు నాగేశ్వర్ నాయక్ ఊరు నుంచి వెళ్లిపోయారు. ఆకుతోటపల్లిలో నివాసం ఉంటున్నారు.
ఎన్ని రోజులు ఇలా ఊరు కాని ఊర్లో ఉంటామని పెద్ద మనుషుల జోక్యంతో బాలమ్మ, ఆమె భర్త నారాయణస్వామినాయక్ స్వగ్రామానికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. తన కుమారుడు కిరణ్ మృతికి చేతబడే కారణమనే అనుమానం పెంచుకున్న కృష్ణానాయక్ బాలమ్మ కుమారుడు నాగేశ్వర్ నాయక్ ను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 25న ధర్మవరంలో ఆటో బాడుగ ఉందని నాగేశ్వర్ నాయక్‌కు చెప్పి అనంతపురం నుంచి ధర్మవరం తీసుకొచ్చాడు. పట్టణ సమీపంలోని చెరువుకట్ట మూడో మరువ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న కృష్ణానాయక్ ఆయన స్నేహితులు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చేతబడి చేసి తన కుమారున్ని చంపారన్న కారణంతో.. ఈ యువకున్ని హత్య చేశారు. పెళ్లై ఏడు నెలల కూడా గడవక ముందే ప్రియాంక పరిస్థితి ఇలా అయింది. అసలు ఈ కాలంలో కూడా చేతబడులు సాధ్యమా? ఇలాంటి దురాచారాలతో మరో వ్యక్తిని బలితీసుకోవడం ఏంటి?
Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్‌ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!