కృష్ణా నది వాటాలో 34శాతానికే కేసీఆర్ సంతకం చేశారు. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కృష్ణా నదిపైన మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రగతి పద్దుతో దళితుల అభ్యున్నతికి కట్టబడి ఉందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రగతి పద్దును పూర్తిగా వినియోగించలేదు. 1,91,000 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం…
హైదరాబాద్లో అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నాయి పార్టీలు. ఇదే టైమ్ అనుకున్నాయో ఏమో కరోనా టీకాలతో రాజకీయ ఎత్తుగడలకు తెరతీశాయి. కానీ.. అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి. పొలిటికల్ వ్యాక్సిన్ వికటించి టెన్షన్ పడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓట్ల కోసం కరోనా టీకా సెంటర్లు ఏర్పాటు! ఎన్నికల సమయంలో వరదలు వస్తే.. బాధితులకు సాయం చేయడానికి పార్టీలు పోటీపడతాయి. ఓట్లు రాబట్టుకోవాలని చూస్తాయి. ఆ సమయంలో జనాలకు ఇంకేదైనా…
విశాఖ:- రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం సాయంత్రం విశాఖకు రానున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక ఈ పర్యటనలో రేపు శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకల్లో పాల్గొనున్నారు ఆర్ధిక మంత్రి. రేపు సాయంత్రం విశాఖ పెడవాల్తేరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా. ఆదివారం కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులను సందర్శించనున్న నిర్మల సీతారామన్…75ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్ ను సందర్శించనున్నారు. ఇక ఆదివారం సాయంత్రం తాళ్ల…
తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత…
కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్రెడ్డి టూర్కు సంబంధించిన షెడ్యూల్ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ…
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ…