ఆయన రెండు దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నారు. ఆయన పేరు చెప్పగానే పార్టీ ఏంటో.. పార్టీ గుర్తు ఏంటో ఇట్టే చెప్పేస్తారు ఆ నియోజకవర్గం జనం. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలోకి మారారు. ఎన్నికల గుర్తు కూడా మారింది. త్వరలో జరిగే ఉపఎన్నికలో మరోసారి బరిలో దిగబోతున్నారు. ఈ సమయంలో ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేయడానికి నానా తిప్పలు పడుతున్నారట ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈస్టోరీలో చూద్దాం. బీజేపీ ఎన్నికల గుర్తును…
బీజేపీలో చేరిన ఈటలపై మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అవినీతి నాయకుడని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని అలాంటి అవినీతి నాయకుడిని బీజేపీలో చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరువాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాదు, మోత్కుపల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు. తనలాంటి వారు బీజేపీలో ఇమడలేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభవం…
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే మనసు మార్పు కోరుకుంటుందా? బ్యాక్ టు పెవీలియన్ అని వచ్చేస్తారా? అనుచరుల మాటేంటి? మాజీ ఎమ్మెల్యే మాట వింటారా? రాం రాం చెబుతారా? ఇదే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఆసక్తిగా మారింది. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా? బీజేపీలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటూ వెళ్లిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు తిరిగి వెనక్కి వచ్చేయడానికి చూస్తున్నరనే చర్చ తెలంగాణలో జోరందుకుంది. ఇప్పటికే కొందరు బీజేపీకి గుడ్‌బై…
కర్ణాటకలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంకాలేదు. అయితే, ముఖ్యమంత్రిని మారిస్తే ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందని కొందరివాదన. అటు అధిష్టానం కూడా యడ్డియూరప్పను మార్చేందుకు సాహసం చేయడంలేదు. కర్ణాటక తాజా రాజకీయాలపై బీజేసీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద సాహసమే అవుతుందని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి…
ఒక మాజీ మంత్రి చేరిక.. ఇంకో మాజీ మంత్రి అలకకు కారణమైంది. అసంతృప్తితో ఉన్న ఆ నాయకుడిని ఎలా బుజ్జగించాలో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. అందుబాటులో ఉన్న పెద్దలందరినీ పంపి సముదాయిస్తున్నారట. ఈ సందర్భంగా ఒక ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన ఒప్పుకొంటారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ఆఫర్? బీజేపీ పెద్దలు ఆఫర్ ఇచ్చారట మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని కాషాయ…
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ…
తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే…