Telangana Minister Errabelli Dayakar Rao About Paddy Procurement.
తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణలో యాసంగి సీజన్ లో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతాయని, కేంద్రం రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామని వెల్లడించిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం రైతులను వరి వేయవద్దని చెప్పిందన్నారు. కానీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం ఎవరు కొనడానికి.. వరి మేము కొంటాం అంటూ రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని తీరా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ కొనాలని మాట్లాడుతూ రైతులను మోసం చేశారన్నారు. బీజేపీ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పిన రోజే తెలంగాణ కేబినెట్ వరి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.