హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. కాగా.. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. గత నెల 27వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం…
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మొత్తానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి వంతు వచ్చింది. ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది.
వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్ లేకున్నా... నంబర్ టూ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని, తాను మాత్రం ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కొత్త పలుకులు పలికారు. ఓహో... అలాగా.... అని అంతా అనుకుంటున్న టైంలోనే... కాకినాడ పోర్ట్ కేసు విచారణకు అటెండ్ అయిన సాయిరెడ్డి...
Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు-2025, ది ముస్లమాన్ వక్ఫ్ రద్దు బిల్లు-2025 రెండు బిల్లులను పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు.
ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు.
AP Cabinet Meeting: ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని…
Jagadish Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
Jupally Krishna Rao: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు అని తేల్చి చెప్పారు.
టీడీపీ - జనసేన - బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయి.. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ రోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు..