తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి గణేష్ ఆత్మహత్యపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మహా సంగ్రామ యాత్రలో ఉన్న.. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకారమని ఆయన అన్నారు. టీఆర్ఎస్, మంత్రి, పోలీసులు సాయి గణేష్‌ను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. సాయి గణేష్‌ది ప్రభుత్వ హత్య అని ఆయన మండిపడ్డారు. కాషాయం జెండా రెపరెపల కోసం సాయి గణేష్ కృషి చేశాడని, ప్రజాస్వామ్య బద్దకంగా, న్యాయ పోరాటం చేశాడన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులు కు పాల్పడ్డారని, వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. స్థానిక మంత్రి హత్య లిస్టు…బాగోతం అంతా తెలుసు అని, అన్ని పార్టీలను మార్చి బీజేపీలో చేర్చుకోమన్నారు.
సాయి గణేష్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌కి కుటుంబం, మంత్రికి కుటుంబం ఉంది… సాయి గణేష్ ఆత్మహత్య పై అత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సాయి గణేష్ స్పూర్తి తో యువకులు ముందు కు రావాలని, సీబీఐ విచారణను సీఎం కోరాలన్నారు. ఈ ఘటనపై సీఎం స్పందించ లేదని, రామాయంపేట, మహబూబాబాద్ లో హత్యలు జరిగాయన్నారు. హైకోర్టు స్థానిక నేతలకు నోటీసులు జారీచేసిందని, న్యాయ పరంగా పోరాటం చేస్తామన్నారు. మంత్రిని వదిలిపెట్టమని, సాయి గణేష్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.