ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లాలోని కందకూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి భారీ ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు హజరై ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇద్దరు సీఎంల దగ్గర పనిచేస్తున్నా.. ఇద్దరూ భిన్నమయిన వ్యక్తులని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ పదవిలో వున్నా ప్రజలకు సేవచేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంశాన్ని కేంద్రం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు. అయితే ఆమె ప్రస్తుతం ఢిల్లీ…
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం మరింత రచ్చగా మారుతోంది… ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన సాయి గణేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అయితే, ఆత్మహత్యాయత్నం తర్వాత మీడియాకు సాయి గణేష్ ఇచ్చిన బైట్ సంచలనంగా మారింది.. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు పోలీసులపై ఆరోపణలు చేశాడు సాయి.. దీంతో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు. Read Also:…
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను ఈ మధ్య ఏ సభలో పాల్గొన్న కేంద్రం విధానాలను తప్పుబడుతున్నారు.. ఇక, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం అనే ఓ జాతీయ మీడియా కథనాన్ని షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. అందులో…
బండి సంజయ్ పాదయాత్ర ఇక్కడ చేసుడు కాదు ఢిల్లీ యాత్ర పెట్టి తెలంగాణ కు రావాల్సిన నిధులు తెప్పించు అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు రైతు కృతజ్ఞత సభను సోమవారం చెన్నూరులో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీజేపీ లీడర్ల కొడుకులు ఏసీ ల్లో ఉంటారు.. సాధారణ బీజేపీ కార్యకర్తలు వారి కొడుకులు లొల్లి పెట్టుకొని, సోషల్ మీడియాలో పోస్టు లు చేసి…
తెలంగాణలో ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఇవ్వని కరెంటు ఉచితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీ ఉడుతా ఉపులకు ఎవరు భయపడ్డారు బండి సంజయ్ అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీజేపీ గాని ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా…
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం…
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ సీటు అనే విషయంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది. మరోవైపు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన రెండో దశ పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. అయితే, ఇవాళ సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు యత్నించాయి. ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రకు నిరసన వ్యక్తం చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజుల ప్రశాంతంగా కొనసాగిన యాత్రలో ఐదో రోజు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెల్చుకుంది. GHMC ఎన్నికల ద్వారా సిటీలో కాషాయం పార్టీకి సానుకూల వాతావరణం వచ్చిందన్నది కమలనాథుల అభిప్రాయం. అయితే ఎన్నికలు అయ్యి దాదాపు 15 నెలలు కావస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. GHMCలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరో పార్టీ తేల్చలేదు. పార్టీ పరంగా కార్పొరేటర్లకు ఇచ్చే పదవులపైనా ఉలుకు.. పలుకు లేదు. ఈ పదవుల కోసమే కొందరు కాచుకుని ఉన్నారు. GHMCలో బీజేపీలో ఫ్లోర్ లీడర్…