తెలంగాణలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు తమ ప్రచారాల్ని మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేసుకుంటున్నారు. వినూత్నమైన ప్రచారాలకూ శ్రీకారం చుడుతున్నారు. బీజేపీ పార్టీ అయితే మరీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్నే లక్ష్యం చేసుకొని.. విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. ఇప్పుడు సాలుదొర – సెలవు దొర ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. కేసీఆర్‌కి వ్యతిరేకంగా పాటలు కూడా…
రాష్ట్రంలో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించుకున్న బీజేపీ.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేరుస్తుందని భావిస్తే, దానికి బదులుగా తెలంగాణపై దండయాత్ర చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు, ఇచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అవమాన పరిచారన్నారు. అసలు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందన్న విషయం.. ఈ సమావేశాలతో తేలిందన్నారు. ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మోసం చేస్తోందని…
కొంతకాలం నుంచి సందిగ్ధతకు తెరదించుతూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అయితే.. ఎర్రశేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించారు. ఈ చేరికకు దూరంగా ఉన్న ఆయన.. నేరచరిత్ర కలిగిన అతడ్ని కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తమ్ముడిని చంపాడన్న ఆరోపణలు…
రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం ఉంటే అలాంటి వారిని వెంటనే చేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఏకాభిప్రాయం రానివి ఉంటే తమ దగ్గరికి పంపించండి అని ఖరాఖండిగా చెప్పేశారట నడ్డా, అమిత్ షా
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, బీజేపీ కీలక నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమి నుంచి ఉపరాష్ట్రపతి పోటీలో నిలిచేందుకే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఉపరాష్ట్రపతి పదవకి నఖ్వీ పోటీ చేస్తారని ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా నఖ్వీ రాజ్యసభ కాలపరిమితి రేపటితో ముగుస్తోంది. దీంతో ఆయన ఇటు రాజ్యసభ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. నక్వీతో పాటు కేంద్ర…
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. ఇదంతా అమిత్‌షా నడుపుతున్న డ్రామా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కెమెరా ముందు విమర్శలు చేసుకుంటున్నట్టు ఆ రెండు పార్టీలు నటిస్తున్నాయని.. తెరవెనుక చాలా తతంగాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తోన్న అమిత్‌షా.. ఆయనకు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఒకవేళ బీజేపీకి 10 నుంచి 15 సీట్లు వస్తే తాను…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఉదంత మరిచిపోక ముందే మరో ఎంపీ కాళీ మాత వివాదంలో చిక్కుకుంది. త్రుణమూల్ కాంగ్రెస్ ఎపీ మహువా మోయిత్రా, కాళీ మాతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమెను అరెస్ట్ చేయాలంటూ బెంగాల్ బీజేపీ నేతలు మమతా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెస్ట్ బెంగాల్…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భారతదేశం, తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చర్చించకపోవడం బాధాకరమని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సమాజంపై ముప్పేట దాడి చేసేందుకు ఈ సమావేశాల్ని బీజేపీ వాడుకుందని ఆరోపించారు. తెలంగాణ పట్ల ప్రధానికి ఉన్న కక్ష తగ్గి, అభివృద్ధి పథకాలతో పాటు నిధులు ప్రకటిస్తారనుకున్నామని.. కానీ నిరాశే మిగిలిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మోదీ పారిపోయారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా…