2023 TS Assembly Survey Polls: టీఆర్ఎస్‌కే మళ్ళీ పట్టం..ఓ సర్వే రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే టైం వుంది. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ సర్వే ముందస్తు ఎన్నికల వేడిని మరింత పెంచేసిందని చెప్పాలి. ఒకవైపు వరదలతో బిజీగా వుంటే… ఆరా సంస్థ ఈ సర్వే ఫలితాలను హైదరాబాద్‌లో విడుదలచేసింది. ఈ సర్వే నివేదిక హాట్ టాపిక్ అవుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వే రిపోర్ట్‌పై అప్పుడే విమర్శలు, ప్రతి విమర్శలు సైతం మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్, ఈ సంవత్సరం మార్చి, జులైల్లో మూడు దఫాలుగా ఈ సర్వే నిర్వహించామని సంస్థ తెలిపింది.
మొత్తం 119 స్థానాల్లో సర్వే నిర్వహించామని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను విడుదలచేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి అని సర్వే సంస్థ కుండబద్ధలు కొట్టింది. టీఆర్ఎస్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్‌కు అత్యధికంగా 38.88 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎదుగుతుంది. 30.48 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుంది. గతంలో రెండో స్థానంలో వున్న కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితం కానుంది.
Also Read
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
- Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు పడతాయి. ఇతర పార్టీలు 6.91 శాతం ఓట్లను సాధిస్తాయి. కరీంనగర్ కోటపై టీఆర్ఎస్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ హవా వీస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇక్కడ టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్‌లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధించగలవు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ కారు జోరు కొనసాగించడం ఖాయం అంటోంది.
https://youtu.be/wDSNvKA7sYs
ఈ జిల్లాల్లో టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్‌లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధిస్తాయంటోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతుంది. ఇక్కడ అత్యధికంగా 40.43 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ- 35.32, కాంగ్రెస్- 16.33, ఇతరులకు 7.92 శాతం ఓట్లు పడతాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ దే మళ్లీ గులాబీ గుబాళింపు.
అక్కడ టీఆర్ఎస్- 35.14, బీజేపీ-20.54, కాంగ్రెస్- 36.22, ఇతరులకు 8.10 శాతం ఓట్లు సాధిస్తుంది. అయితే ఇక్కడ ఓట్లు తగ్గుతాయంటోంది. 2018లో 46.87 శాతం ఓట్లను సాధించిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో అయిదుశాతం ఓటుబ్యాంకును కోల్పోయిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28.43 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019 లోక్‌సభలో ఈ సంఖ్య పెరిగింది. 29.78గా నమోదైంది. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు గాను 87 స్థానాల్లో టీఆర్ఎస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్-53, బీజేపీ-29 చోట్ల గట్టి అభ్యర్థులు ఉన్నారని సర్వే చెబుతోంది.
తాజావార్తలు
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!