దేశంలో నీతి వంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందామని ఆయన అన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇటీవల జరిగిన బహిరంగ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని ఆయన అన్నారు.…
దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్…
రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు.…
ఇవాళ మీడియాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మేకిన్ ఇండియా పథకం అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అంటున్నారు. పాకిస్థాన్ మనకు అసలు సమస్యే కాదు. అది స్మాల్ ప్రాబ్లం. చైనాతోనే మనకు ముప్పు పొంచి ఉంది. స్విస్ బ్యాంకులోని డబ్బులను వెనక్కి తెస్తామన్నారు. కానీ అక్కడ డిపాజిట్లు డబుల్ అయ్యాయి. దీనికి ఎవరు బాధ్యులు. ఢిల్లీలో మాటలు చెప్పే ఇంజన్ వద్దు. పనిచేసే ఇంజన్…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ మీటింగులో.. ఒక జాతీయ పార్టీగా బీజేపీ సాధించింది ఏమీలేదని విమర్శించారు. తాను అడిగిన 9 ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని తప్పుపట్టారు. దేశాన్ని బీజేపీ పట్టిపీడిస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు వాళ్లు చేసిందేమీ లేదని, వాళ్ల దగ్గర సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రూపాయి విలువ 80కి ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.…
వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేవలం సొంతంగా ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వరసగా ఎదురువుతున్న పరాభవాలు పార్టీ కార్యకర్తలను, నేతలను నిరాశ పరుస్తున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నా పంజాబ్ రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయింది. దీంతో పాటు ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది. వరసగా కీలక నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గోవాలో కూడా భారీ…
బీజేపీ తెలంగాణలో జోరు పెంచుతోంది. క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘ప్రజలు, పల్లె ఘోష బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెపట్టనుంది. ఒక్కో నేతకు నాలుగు నియోజక వర్గాల్లో ర్యాలీలు అప్పచెప్పారు. మొత్తం 30 మంది నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఒక్కో…
బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. శనివారం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని..నేను టీఆర్ఎస్ పార్టీలో చేరింది గజ్వేల్ నియోజకవర్గంలోనే అని.. గజ్వేల్ పై ప్రత్యేక దృష్టి పెట్టానని.. బెంగాల్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీని ఓడించినట్లే కేసీఆర్ ని ఇక్కడ నుంచి ఓడిస్తానని అని కామెంట్స్ చేశారు. Read…
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడిగా వేషం ధరించి నుక్కుడ్ నాటకంలో నటించిన వ్యక్తిపై నాగోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంపై సీఎం హిమంతబిశ్వ శర్మ కూడా స్పందించారు. దుస్తులు ధరించడం నేరం కాదని.. అలాంటి…