Munugode Bypoll Results: బీజేపీ ఆశలు గల్లంతు.. ఇలా జరిగిందేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారిపోతున్నాయి.. తొలిరౌండ్ నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి… రెండో రౌండ్, మూడో రౌండ్, నాల్గో రౌండ్లో బీజేపీకి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా.. మొత్తంగా మాత్రం నాల్గో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్కు 613 ఓట్ల మెజార్టీ లభించింది.. అయితే.. చౌటుప్పల్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… కానీ, రాజగోపాల్ రెడ్డి ఆశలను గల్లంతు చేశారు చౌటుప్పల్ ఓటర్లు.. భారీ మెజార్టీ ఆశించిన బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే ఇదే సమయంలో చౌటుప్పల్ ప్రాంతంలో బాగా పుంజుకుంది టీఆర్ఎస్ పార్టీ..
Read Also: Rajagopal Reddy: నేను అనుకున్న మోజారిటీ రాలేదు..
Also Read
- Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
- GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ఇక, నాల్గో రౌండ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో మేం అనుకున్న మెజార్టీ రాలేదన్నారు.. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయన్నారు.. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చన్న ఆయన… మొత్తంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం తనకు ఉందన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మొత్తంగా బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.. చౌటుప్పల్ మండలంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి నిరాశ తప్పలేదు.. అర్బన్ ప్రాంతంలో 5 వేల మెజార్టీ వస్తుందని లెక్కలేసుకున్న రాజగోపాల్ రెడ్డికి.. షాక్ తగిలినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
-
PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!