తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విమర్శలు చేస్తే దాడులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటిపై దాడి చేసి మా అమ్మను, మహిళలను భయపెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఎంపీ అరవింద్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటిలో చొరబడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముందు జిస్టి బొమ్మను దగబెట్టి నిరసన తెలిపారు.
ఏపీలో ఎన్నికలకు 17 నెలల వరకూ గడువు వుంది. అయితే, అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. 175 సీట్లే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.