Will rename Meerut as Nathuram Godse Nagar says Hindu Mahasabha: ఉత్తర్ ప్రదేశ్ అర్భన్ బాడీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మారుస్తాం అని ప్రకటించింది హిందూ మహాసభ. తాము గెలిస్తే మీరట్ నగరం పేరును ‘నాథురామ్ గాడ్సే నగర్’ మారుస్తామని ఆ రాష్ట్ర హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. అన్ని వార్డుల్లో కూడా తాము పోటీచేస్తామని తెలిపారు. ఇదే విధంగా హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యం అని.. గోమాతను కాపాడుకుంటామని తెలిపింది.
Read Also: Satyendar Jain: జైలులో మంత్రి భోగాలు.. మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ
బీజేపీ, శివసేనపై తీవ్రస్థాయిలో మండిపడింది హిందూ మహాసభ. ఈ రెండు పార్టీల్లో ఇతర వర్గాల ప్రజలు చేరడంతో వారు తమ భావజాలాన్ని వదిలేస్తున్నారంటూ విమర్శించింది. హిందూ మహాసభ తగినంత మంది కౌన్సిలర్లను సంపాదించి, మేయర్ పదవి గెలిస్తే మీరట్ పేరును తప్పకుండా మారుస్తామని ప్రకటించింది. నగరంలోకి వివిధ ప్రాంతాల ఇస్లామిక్ పేర్లను మార్చి హిందూ నేతల పేర్లను పెడతామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్ శర్మ అన్నారు. దేశభక్తి గల అభ్యర్థులను గుర్తిస్తామని.. సంస్థ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని వారంతా హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
బీజేపీ తనను తాను హిందూ పార్టీగా చెప్పుకునేంది.. కానీ నేడు ఆ పార్టీలోకి వివిధ వర్గాల ప్రజల ఆధిపత్యం పెరుగుతోందని.. ఇదే విధంగా శివసేన కూడా ఇస్లామిక్ బుజ్జగింపు రాజకీయాల వైపు పయణిస్తోందని హిందూ మహాసభ పేర్కొంది. తమ మొదటి కర్తవ్యం.. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడమే అని హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. రెండోది గోమాతను జాగ్రత్తగా చూసుకోవడం అని అన్నారు. మత మార్పిడులను అరికట్టేందుకు, ఇస్లామకి్ బుజ్జిగింపు రాజకీయాలను అరికట్టేందుకు ఈ సంస్థ పనిచేస్తుందని ఆయన అన్నారు.