Vemula Prashanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆరోపణలు, విమర్శల పర్వంలో రెండు పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి… బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు బీఆర్ఎస్ నేతలు.. తాజాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురపించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. దేశం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును పొగుడుతుంటే..…
తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.. డాక్యుమెంట్లు ఇస్తే.. విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. దీంతో.. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐకి సూచించింది ధర్మాసనం.. ఇదే…
AAP, BJP councillors clash inside MCD house, Delhi Mayor elections postponed: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ఎన్నిక బీజేపీ, ఆప్ పార్టీ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. ఆప్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టేబుళ్లు, కుర్చీలు విసిరేసుకున్నారు. దీంతో మొత్తం గందరగోళంగా మారడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు ఎన్నికను వాయిదా వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా…
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగసవాల్ విసిరారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.