Peeing in open on campus, BJP targets Kanhaiya Kumar over urinating incident: ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశంలో విమానయాన రంగంలో సంచలనంగా మారింది. డీజీసీఏ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎయిర్ లైన్స్ సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడని చెబుతూ…
6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిధులపై కేటీఆర్ మీ అయ్యతో చర్చకు సిద్దం.. రాజీనామ పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అంటూ సవాల్ విసిరారు.
తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్ బూత్ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్ కమిటీలు ఎంత వరకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ బీజేపీ నేతలకు దొరకనుంది.
Bandi Sanjay: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. సీఎం కేసీఆర్ వచ్చేవరకు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి కదిలేదిలేదని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.. దీంతో, బండి సంజయ్, కొందరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, బండి సంజయ్‌ను పోలీస్ వాహనంలో ఎక్కించి పీఎస్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. ఆ వాహనాన్ని అడ్డుకున్నారు కార్యకర్తలు.. పోలీస్ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు..…
Rahul Gandhi criticizes Prime Minister Narendra Modi: భారత్ జోడో యాత్రలో మరోసారి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ, బీజేపీ పాలనపై శుక్రవారం విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో రెండు భారతదేశాల ఉన్నాయని.. ఒకటి రైతులు, కార్మికులు, నిరుద్యోగులతో కూడినది అయితే రెండోది 100 మంది ధనవంతులకు చెందినదని.. వీరి చేతుల్లోనే దేశ సంపద సగం ఉందని అన్నారు. హర్యానా పానిపట్ లో జరిగిన ర్యాలీలో అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చేదాకా కలెక్టర్ కార్యాలయం వద్దే కూర్చాంటా అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డికి చేరుకున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాములుని కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చేసిన హత్యేనని ఆరోపించారు.. ముఖ్యమంత్రి కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టరేట్ వద్దనే కూర్చుంటాన్న ఆయన.. కామారెడ్డి రైతులకు న్యాయం…
నాపై కేసు వెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్ర దాగిఉందని ఆరోపించారు బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు రోహిత్‌రెడ్డి.. మాపై మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు కాంగ్రెస్, బీజేపీ కుట్రగా అభివర్ణించారు.. మేం పార్టీ మారితే.. నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? అని నిలదీసిన ఆయన.. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలం కాంగ్రెస్ పార్టీ నుంచి విలీనం అయ్యామని…
CBI: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుండగా.. దానిని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు సింగిల్ బెంజ్ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఈ పరిణామాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్ చేశారు.. దీనిపై ఇవాళ వాదనలు హాట్‌హాట్‌గా సాగాయి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఎమ్మెల్యేలకు ఎర…
Congress and BRS Alliance: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన కేసీఆర్.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశారు.. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి కేసీఆర్ పనిచేస్తారని ఆది నుంచి ఆరోపిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్తో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. ఈ విషయాన్ని…